Sunday, September 13, 2026
Homeమెదక్విష్ణు పాఠశాలలో వినాయక చవితి, హిందీ భాషా దినోత్సవ వేడుకలు

విష్ణు పాఠశాలలో వినాయక చవితి, హిందీ భాషా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 12 :

నర్సాపూర్ (11) నర్సాపూర్ లోని విష్ణు ఉన్నత పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి మరియు హిందీ భాషా దినోత్సవ వేడుకలనుసామూహికంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రముఖ హిందీ కవి తులసీదాస్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించి హిందీ భాష ప్రాముఖ్యతను గురించి పాఠశాలప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి, హిందీఉపాధ్యాయులు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం విద్యార్థుల చేత మట్టి వినాయక ప్రతిమలను చేయించి, పూజలు నిర్వహించారు. వినాయక చవితి విశిష్టతను వివరిస్తూప్రధానోపాధ్యాయురాలుతో పాటు ఉపాధ్యాయులు ప్రసంగించారు.ఈకార్యక్రమంలోబీవిఆర్ఐటీ కళాశాల డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ బాపిరాజు, ఏవో సురేష్,పాఠశాలయాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!