విష్ణు పాఠశాలలో వినాయక చవితి, హిందీ భాషా దినోత్సవ వేడుకలు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 12 : నర్సాపూర్ (11) నర్సాపూర్ లోని విష్ణు ఉన్నత పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి మరియు హిందీ భాషా దినోత్సవ వేడుకలనుసామూహికంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రముఖ హిందీ కవి తులసీదాస్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించి హిందీ భాష ప్రాముఖ్యతను గురించి పాఠశాలప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి, హిందీఉపాధ్యాయులు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం విద్యార్థుల చేత మట్టి వినాయక...