Monday, September 14, 2026
Homeమెదక్ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

జిల్లాల్లో ఆకర్షణీయ కార్యక్రమాలు చేపట్టాలి : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10:

మెదక్ జిల్లా (9) ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్ సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. యువతలో పర్యాటక రంగంపై ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల ప్రచారం, అభివృద్ధిపై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. యువ టూరిజం క్లబ్‌ల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమాలను ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో నిర్వహించాలని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఫిల్మ్ టూరిజం ద్వారా పర్యాటక ప్రాంతాలను మరింత ప్రోత్సహించాలని సూచించారు. జ్ఞాన భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి డిజిటలైజేషన్ చేయాలని వాణి ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాలు, దేవాలయాలు, మఠాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద ఉన్న మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. గుర్తించిన మాన్యుస్క్రిప్ట్‌లను డిజిటలైజ్ చేసి కేంద్రీకృత సేకరణలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యాటక ప్రాంతాల గురించి ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా టూరిజం అధికారి రమేష్, డీపీఆర్వో రామచంద్ర రాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!