Monday, September 14, 2026
Homeమెదక్చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీస్ రక్షణ

చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీస్ రక్షణ

📰 Generate e-Paper Clip

బ్లూకోల్ట్ పోలీసులకు రాఖీ కట్టిన సోదరి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 29 :

మెదక్ జిల్లా (28) రాఖీ పౌర్ణమి సందర్భంగా విధుల్లో ఉన్న బ్లూకోల్ట్ పోలీసులకు ఓ సోదరి రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. ప్రజల భద్రత కోసం పండగ రోజున కూడా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.‘‘చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీస్ రక్షణ’’ అంటూ పోలీసుల సేవలను కొనియాడారు. మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నారంటే పోలీసుల భద్రతపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది సైతం సోదరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ఆత్మీయ అనుబంధం మరోసారి వెల్లడైంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!