A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (13) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న పరేడ్ ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్ రిహార్సల్‌ను పరిశీలించిన ఆయన.. పోలీసు సిబ్బంది కమాండ్లకు అనుగుణంగా చేస్తున్న కదలికలు, కవాతు తీరును నిశితంగా పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పూర్తి ఉత్సాహంతో, క్రమశిక్షణతో పాల్గొనాలని అదనపు ఎస్పీ సూచించారు. కవాతులో అడుగులు, టర్నింగ్‌లు, కమాండ్లకు అనుగుణంగా చేసే కదలికలు ఏకరీతిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
పరేడ్‌లో పాల్గొనే సిబ్బంది టర్న్‌అవుట్ కూడా ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

