Friday, July 31, 2026
Homeమెదక్దోస్త్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల

దోస్త్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జూలై 19, మెదక్ ప్రతినిధి (రాజ్ కుమార్)

మెదక్(18) మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ప్రవేశాల కోసం దోస్త్  స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులతో పాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే జూలై 20 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్పెషల్ ఫేజ్‌లో సీటు పొందిన విద్యార్థులు జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోపు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి కళాశాలలో చేరాలని తెలిపారు. కళాశాల దోస్త్ సమన్వయకర్త సురేందర్ రావు మాట్లాడుతూ, ఇప్పటికే దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా స్పెషల్ ఫేజ్‌లో పాల్గొనవచ్చని చెప్పారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!