Tuesday, September 15, 2026
Homeమెదక్ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

📰 Generate e-Paper Clip

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (29) ఓటరు జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ నంబర్–135ను సందర్శించి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి కొనసాగుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటి యజమానులకు ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో బీఎల్‌వోలు స్పష్టంగా వివరించాలని సూచించారు. నింపిన ఫారాలను రెండు నుంచి మూడు రోజుల్లోపు తిరిగి బీఎల్‌వోలకు అందజేయాలని ఓటర్లకు తెలిపారు. గ్రామంలో మరో రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఫారాల పంపిణీ సమయంలోనే ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి, ఎలాంటి అపోహలకు తావులేకుండా పూర్తి వివరాలతో ఫారాలను నింపి తిరిగి అందజేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!