ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (29) ఓటరు జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ నంబర్–135ను సందర్శించి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి కొనసాగుతున్న ఫారాల...