A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 31 :
నర్సాపూర్ : బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)తో ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ (ఏటీఎస్) సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీ ఆర్. రవిచంద్రన్ రాజగోపాల్, ఏటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామనాథన్ శ్రీనివాసన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కళాశాలలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఏటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామనాథన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ తమ సంస్థ ఆటోమొబైల్ రంగంలో అత్యాధునిక పరీక్షా సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందిస్తోందన్నారు. వాహనాల నాణ్యత, భద్రత ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆటోమోటివ్ టెస్టింగ్, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, ఇంజినీర్లకు శిక్షణ వంటి సేవలను అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు ప్రయోగశాల సదుపాయాలను సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీ రవి చంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ఇంటర్న్షిప్లు, పరిశోధన ప్రాజెక్టుల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయాన్నిపెంపొందించడమే ఒప్పంద లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సంజయ్ నిబాంధే, డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్, విభాగాధిపతులు డా. ఎ. వరుణ్, డా. సుబి, రామారెడ్డి, డా. సంజీవ్ రెడ్డి, విష్ణు మోటార్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ మేనేజర్ మనోనీత్ సింగ్, డా. డి.వి.రాజు,డాక్టర్ఆర్.ముత్తలగు, డీన్లు, అధ్యాపకులు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

