A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 5:25 am Posted by : A2TV NEWS

గడ్డి కోస్తుండగా పాము కాటు.. మహిళ మృతి

A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) అక్టోబర్ 1:

చేగుంట (30) మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద గడ్డి కోస్తుండగా గుర్తుతెలియని పాము కాటేయడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి లక్ష్మి (40), భర్త కనకయ్య, వృత్తిరీత్యా కూలి పని చేస్తోంది. సెప్టెంబర్ 29, 2026న ఉదయం సుమారు 9 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్ద గడ్డి కోయడానికి వెళ్లింది. గడ్డి కోస్తున్న సమయంలో గడ్డిలో ఉన్న గుర్తుతెలియని పాము ఆమె ఎడమ కాలి బొటనవేలు సమీపంలో కాటు వేసినట్లు తెలుస్తోంది. అయితే పాము కాటును ఆమె వెంటనే గుర్తించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతురాలి భర్త దేశెట్టి కనకయ్య, తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.