వామ్మో రోడ్లు..! బాగు చేసేది ఎప్పుడు..?

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా..? — గుంతలమయంగా మారిన ప్రధాన రహదారి.. వాహనదారుల ఆందోళన A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18: చేగుంట (17) చేగుంట మండలం నుంచి కర్ణంపల్లి మీదుగా గజ్వేల్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోనాల వెళ్లే డబుల్‌ రోడ్డు వర్షాల కారణంగా కల్వర్టుల వద్ద పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు నరకప్రాయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని...