A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:59 am Posted by : A2TV NEWS

విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి….

– విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకోవాలి….

– 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలి..

A2న్యూస్ నర్సాపూర్.(కొల్చారం )ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 18:

కొల్చారం (17)  మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతినిపురస్కరించుకుని విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని, చారిత్రక ప్రాధాన్యతను నాయకులు వివరించారు. విశ్వకర్మ భగవానుడు సృష్టికి అవసరమైన పనిముట్లతో పాటు దేవతల నగరాలు, ద్వారక, హస్తినాపురం, స్వర్ణలోకం, మాయాసభ, ఇంద్ర భవనం వంటి నిర్మాణాలను రూపొందించినట్లుతెలిపారు.ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామస్థాయిలో అనేక మంది విశ్వకర్మలు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విశ్వకర్మలను ఆదుకోవడంతో పాటు 50 సంవత్సరాలు నిండిన ప్రతి విశ్వకర్మకు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల ప్రభాకర్ చారి, గ్రామ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, దుర్గపతి చారి, పాండురంగాచారి, సిద్ధయ్య చారి, నరసింహ చారి, వీరస్వామి చారి, శ్రీనివాస్ చారి, శివకుమార్ చారి, కరుణాకరాచారి, శ్రవణ్ చారి, విశ్వేశ్వర్ చారితో పాటు మహిళలు పాల్గొన్నారు.