A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:20 am Posted by : A2TV NEWS

శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు

మండపాల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పక పాటించాలి : మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 14 :

మెదక్ జిల్లా (13) వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతి పొందాలని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని, మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు, తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. అధిక శబ్దంతో డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని, యువత క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎస్పీ కోరారు. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీసుశాఖకు సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు.