ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు పారదర్శకంగా విచారణ చేపట్టాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు

A2న్యూస్, జూలై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (20) ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు...