తూప్రాన్‌లో నకిలీ వైద్యంపై కలకలం

అర్హత లేని వైద్యంపై కేసు నమోదు.. అధికారుల పాత్రపైనా ప్రశ్నలు A2న్యూస్, జూలై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) తూప్రాన్ (22) తూప్రాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చిన నకిలీ వైద్య వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. వైద్య అర్హతలు లేకుండానే చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ భవాని ప్రథమ చికిత్స కేంద్రం వ్యవహారంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అంశంపై ప్రజలు సమాధానం కోరుతున్నారు. సామాజిక కార్యకర్త...