ట్రిపుల్‌ఆర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 20: మెదక్ జిల్లా (19) ట్రిపుల్‌ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ట్రిపుల్‌ఆర్ భూసేకరణపై నేషనల్ హైవేస్, రైల్వే, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అవార్డు పాస్...