తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7: పెద్ద శంకరంపేట్ (6) తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా పెద్ద శంకరంపేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ భావితరాలకు ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చేసిన కృషి...