A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7:
పెద్ద శంకరంపేట్ (6) తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా పెద్ద శంకరంపేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ భావితరాలకు ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతి కుమార్, ఆర్‌ఐ నాగరాజు, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.