మెదక్ ఖిల్లాకు పర్యాటక హంగులు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18: మెదక్ జిల్లా (17) చారిత్రక మెదక్ ఖిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్‌ను రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ ఖిల్లాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్‌ కింద ఖిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, కేంద్ర నిధులు తీసుకురావడానికి ఎంపీ రఘునందన్ రావు కృషి చేయాలని...