A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:09 am Posted by : A2TV NEWS

మెదక్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 1 నుంచి పోలీస్‌ యాక్ట్‌ అమలు

ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:

మెదక్‌ జిల్లా (31) శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్న కాలంలో పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్స్‌, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం, జిల్లాలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేయడం ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.