ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేదు: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు
A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13) ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారణ నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు,...