లోది సామాజిక వర్గం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

సామాజిక వివక్షకు తావులేకుండా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి: బీసీ కమిషన్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17: మెదక్ జిల్లా(16) లోది సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాల లక్ష్మీరంగు గురువారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని లోది సామాజిక వర్గం నివాస ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా...