నిర్దేశిత గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి

ఆర్డీవోలు, తహసీల్దారులతో గూగుల్ మీట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (10) పారదర్శక  ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ పురోగతిపై ఆర్డీవోలు, తహసీల్దారులతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్...