ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర మరువలేనిది

పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మానం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8: మెదక్ జిల్లా (7) ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర మరువలేనిదని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నరసింహచారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం...