ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి – జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము మెదక్ జిల్లా (13) ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో 235, ప్రైవేట్ సంస్థల్లో 97 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICCలు) ఏర్పాటు...