నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాలి – జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1: మెదక్ జిల్లా (31)నిరుపేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వార్డులు, వంటగది, భోజనశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే వైద్యుల హాజరు నమోదును పరిశీలించారు....