కరెంట్ కోతలతో రైతులు విలవిల.. పంట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి! నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలి – ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి
విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన నర్సాపూర్ ఎమ్మెల్యే A2న్యూస్, మెదక్ జిల్లా/నర్సాపూర్ ప్రతినిధి (రాము) అక్టోబర్ 16: నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నెలల తరబడి కష్టపడి, లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన రైతులు విద్యుత్ సమస్యలతో నష్టపోతుంటే...