సోమవారం కలెక్టరేట్ ముట్టడికి దివ్యాంగుల పిలుపు

A2న్యూస్, జులై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సిద్దిపేట జిల్లా (24) వివిధ రకాల దివ్యాంగుల సహాయక పరికరాలు, బ్యాటరీ వాహనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగులు సోమవారం ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలంగాణ దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, కొంతమంది అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఒకే వ్యక్తికి రెండు వాహనాలు మంజూరు చేసినట్లు తమ వద్ద...