రక్తదానం గొప్పది  మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ 

A2 న్యూస్, జూన్ 15, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)  దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం వల్ల ఒక ప్రాణం నిలబడుతుందని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ అన్నారు. సోమవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాపారావు గత 20 ఏళ్ల నుండి ఇప్పటివరకు 62 సార్లు రక్తదానం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ కార్యాలయంలో పాపారావును శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రాణం నిలిపే...