A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:13 am Posted by : A2TV NEWS

విష్ణు ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్10:

నర్సాపూర్ (9) నర్సాపూర్ లోని విష్ణు ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 9వ తేదీన కాళోజి నారాయణరావు గారి జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి నారాయణరావు చిత్రపటానికిపూలమాలవేసికార్యక్రమాన్నిప్రారంభించారు. కాళోజి సాహిత్య సేవను, భాష ఔనత్యాన్ని, భాష ఉనికిని, భాష పరిరక్షణను తెలుపుతూ పాఠశాలప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి, తెలుగుభాషోపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కొంత మంది విద్యార్థులు పాటలు పాడి, కాళోజి నారాయణరావు, తెలంగాణ భాష గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ విఆర్ఐటి కళాశాల డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ బాపిరాజు, ఏవో సురేష్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.