చిట్కూల్ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు
ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉమాదేవికి ఎస్పీ అభినందనలు విద్యార్థినులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6: చిట్కూల్ (5) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్కూల్ కేజీబీవీలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ...