ఆగస్టు 31లోగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25: మెదక్ జిల్లా (24) కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టు 31లోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రత్యేక ఆదేశాల మేరకు ప్రభుత్వ...