గౌతాజిగూడెంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
చెత్త, పిచ్చిమొక్కల తొలగింపు.. పరిశుభ్రతపై అవగాహన A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 2: మనోహరాబాద్ (1) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతాజిగూడెం గ్రామంలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీసీ సంస్థ, ఐటీసీ పంచమి చంద్రం, ఐటీసీ ఎంజీఓఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పరిశుభ్రత...