చెత్త, పిచ్చిమొక్కల తొలగింపు.. పరిశుభ్రతపై అవగాహన
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 2:
మనోహరాబాద్ (1) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతాజిగూడెం గ్రామంలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీసీ సంస్థ, ఐటీసీ పంచమి చంద్రం, ఐటీసీ ఎంజీఓఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ లేదా సంస్థల బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ నాగరాజు, పాలకవర్గ సభ్యులు, ఐటీసీ ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.