ఎన్‌హెచ్-44పై నిఘా మరింత పటిష్ఠం తూప్రాన్ టోల్‌గేట్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ
A2న్యూస్, జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) తూప్రాన్ (7) జాతీయ రహదారి-44పై భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌ను ఆయన తనిఖీ చేసి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని సూచించారు. సీసీ...