గంజాయి వంటి మాదకద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి – టాస్క్ ఫోర్స్ బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశం A2న్యూస్ ,జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (7) గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, జిల్లాలో మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించే దిశగా తెలంగాణ ఎక్సైజ్ & ప్రొహిబిషన్ శాఖ కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో...