మెదక్ జిల్లాలో కోతుల బెడద నియంత్రణకు పటిష్ట చర్యలు
ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 20: మెదక్ జిల్లా (19) మెదక్ జిల్లాలో కోతుల బెడదను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రత్యేక కార్యాచరణతో వేగవంతంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల పంటలను కాపాడడంతో పాటు ప్రజలకు కోతుల బెడద నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ చాంబర్‌లో కోతుల బెడద నివారణపై అటవీ...