మెదక్‌లో తాత్కాలిక కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చర్యలు
అనువైన పాఠశాల భవనాల గుర్తింపునకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా (19) జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయెల్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్రీయ...