A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:56 am Posted by : A2TV NEWS

గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ

గ్రామ అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చ

A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) అక్టోబర్ 3:

చేగుంట (2) మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సబిత, గ్రామ ప్రజలు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వీవీబీజీ రామ్‌జీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభలో గుర్తించి చర్చించారు. గ్రామంలో మట్టి పనులు, లింక్ రోడ్లు, జలసిరి పంట కుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు, గ్రామపంచాయతీ భవనం, అంగన్‌వాడీ భవనం, కుల సంఘ భవనాలు, సీసీ రోడ్లు, సీసీ మురుగు కాలువలు, చెరువులు–కుంటలకు సంబంధించిన అభివృద్ధి పనులు, గోదాముల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను గుర్తించి, గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని గ్రామసభలో నిర్ణయించారు.