మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు నార్కోటిక్ డాగ్ ‘జూబి’తో హోటళ్లు, దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి: హవేళీఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ A2న్యూస్ జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) హవేళీఘనపూర్ (3) మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా హవేళీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ధన గ్రామంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డాగ్ 'జూబి' సహాయంతో గ్రామంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు తదితర అనుమానాస్పద ప్రాంతాల్లో...