టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12: టేక్మాల్ (11) పోలీస్‌స్టేషన్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణను ఆయన పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని...