ప్రజల ఇబ్బందులపై ఎస్పీ వెంటనే స్పందన.. దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు

కొత్తపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలకు ఊరట A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13: పాపన్నపేట (12) పాపన్నపేటకు వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఊరట లభించింది. బ్రిడ్జి నిర్మాణం జరిగిన నాటి నుంచి రహదారి దెబ్బతినడంతో ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది.ఈ సమస్యపై దృష్టి సారించిన మెదక్‌ జిల్లా ఎస్పీ...