ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: ఎమ్మెల్యే రోహిత్‌రావు
పాపన్నపేటలో ఐ జి ఎల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.. మూడు గ్రామాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 3: మెదక్ జిల్లా (2) ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు బుధవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పాపన్నపేట మండలం...