ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జులై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (24) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ స్థాయిలో తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలాల వారీగా ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో చేపట్టి, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర...