ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జూలై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (14) ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కొల్చారం మండలం వరిగుంటం గ్రామంలో తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ,...