A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:38 am Posted by : A2TV NEWS

బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 16:

ఎల్దుర్తి (15) మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు హక్కింపేట డ్యామ్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అరెస్టయిన వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. జూదం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.