A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:11 am Posted by : A2TV NEWS

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

A2న్యూస్ నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 11 :

కొల్చారం (10) మండలంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఫిర్యాదుదారు తాటి నర్సింహులు, తండ్రి లక్ష్మయ్య, వయస్సు 50 సంవత్సరాలు, కులం: పద్మశాలి, వృత్తి: ఇన్‌స్పెక్టర్ (సి ఎస్), మెదక్, నివాసం: ఇంటి నెంబర్.19-2/1, ఎన్జీవో కాలనీ, నర్సాపూర్ గ్రామం మరియు మండలం, మెదక్ జిల్లా, కొల్చారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఒక పిటిషన్ సమర్పించారు. తన పిటిషన్‌లో ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 09.09.2026 రాత్రి సుమారు 01:00 గంటల సమయంలో కొల్చారం పోలీసులు పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద వాహనాలతనిఖీలునిర్వహిస్తుండగా, కే ఏ-32-AA-4947 నంబరు గల డి సి ఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంతో సహా మొత్తం 290 బస్తాల పిడిఎస్ బియ్యం, మొత్తం 143.10 క్వింటాళ్ల బరువుతో ఉన్నట్లు గుర్తించారు. వాహనం డ్రైవర్ అయిన ముజీబ్, తండ్రి ఖాజా పాషా సాబ్, విచారణలో తాను చంద్రాయణగుట్ట ప్రాంతంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల వద్ద నుండి తక్కువ ధరకు పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, మెదక్ మీదుగా బోధన్‌కు తరలించి, అక్కడ అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. అదేవిధంగా, స్వాధీనం చేసుకున్న బియ్యం మరియు డీసీఎం వాహనం తనవేనని తెలిపాడు. తెలంగాణ రాష్ట్ర పిడిఎస్ కంట్రోల్ ఆర్డర్ , 2016 నిబంధనలకు, ముఖ్యంగా క్లోజ్17(ఇ) కు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ఫిర్యాదుదారు కోరారు. దీనిపై పోలీసులు 290 బస్తాల పిడిఎస్ బియ్యం (143.10 క్వింటాళ్లు) మరియు కే ఏ,32-AA-4947 నంబరు గల డీసీఎంవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని లింగాపూర్ గ్రామంలోని తిరుమల అగ్రో ఇండస్ట్రీస్‌లో భద్రపరిచారు. డీసీఎం వాహనాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.