రోడ్లపైనే వడ్ల ఆరబోత

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 31 : వడ్లు రోడ్లపైనే ఆర బెట్టడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పంటలుకోతఅయిపోగానే రోడ్లపై పంట నూర్పిల్లు చేయడంతో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇలా ప్రమాదకరంగా రోడ్లపై వడ్లు అరబెట్టకుండా చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాలని పలువురు వాహనదారులుకోరుతున్నారు.