A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 5:52 am Posted by : A2TV NEWS

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 9:

మనోహరాబాద్ (8) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన బక్కుల సత్యమ్మ (65) మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నాగరాజు మంగళవారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ, సత్యమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.