ఏ2న్యూస్, ఆగస్టు14: నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
నర్సాపూర్ (13) కార్మికులు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ అన్నారు. గురువారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ లు వర్షాకాలంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రైన్ కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ లు మాట్లాడుతూ పారిశుద్ధం విషయంలో మీ సేవలు ఎనలేనివని, విధి నిర్వహణ ఎంత ముఖ్యమో మీ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత నిస్తూవిధులునిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ వనముల బుచ్చయ్య యాదవ్, కౌన్సిలర్లు సుధీర్ గౌడ్, నిరంజన్ దాస్, శ్రీకాంత్, మేనేజర్ మధుసూదన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సల్లమురళీమోహన్, జవాన్లు ఎల్లం, అశోక్, జనార్ధన్, సిబ్బంది పాల్గొనడం జరిగింది.